Wednesday, December 3, 2008

బ్లాగు మొదలుపెట్టి చాల రోజులు అయినా ఏమి వ్రాయాలో తెలియక , బ్లాగు లో వ్రాయదగ్గ విషయాలు లేక ఏమి వ్రాయలేదు . కానీ ఈరోజు నామనసు మనసులో లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయాలు నా మనసును కలచివేస్తున్నాయి.
తమను తము ఇస్లాం మతఉద్దారకులుగా చెప్పుకొనే ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పనులు మహమ్మద్ ప్రవక్త ఒకవేళ బ్రతికి ఉంటే సిగ్గుతో తల దించుకోనవలసిన పరిస్థితి తెచ్చే విధంగా ఉన్నాయి.
శాంతి దూతగా ప్రపంచం కొనియాడిన వ్యక్తి అనుచరగణం చేయవలసిన పనులేనా ఈ ఉగ్రవాద ఘటనలు?
ముస్లిముల పేరుతొ ఉగ్రవాదులు చేస్తున్న పనులు అనేక అమాయక ముస్లింల ప్రాణాలు కూడా తీస్తున్నాయని వీరు గ్రహించరా?
వీరి ఆఖరి ఆశయం ఏమిటో వారికే తెలియని మూర్ఖులు అనుకోవాలా? ఇస్లాం కత్తి తో కంటే మనసులను గెలుచు కోవటం తోనే ఎక్కువగా వ్యాప్తించింది అని అర్ధం చేసుకోలేని కసాయి వాళ్ళని అనుకోవాలా?
మన ముందు ఉన్న సవాలు ఒక్కటే - మన సమాజం లో హింసకు తావులేదని ఉగ్రవాదులకు తెలియ చెప్పడం మాత్రమె కాకుండా వీరికి సహాయం అందిస్తున్న వారిని కూడా ఒంటరి వారిని చేసి వారు దిగివచ్చే వరకు పోరాటం చేయాలి.
అలాగే ఉగ్రవాదుల వైపు ఆకర్షితులయ్యే యువకులు కూడా తామూ దేవుని యుద్ధం లో పాల్గొనటం లేదని, అమాయక ప్రాణుల జీవితాలతో ఆడుకుని చివరికి కుక్క చావు చస్తున్నామని గ్రహించి సన్మార్గం లో మారాలి.
అల్లా వారికి సన్మార్గము వైపు దారి చూపించాలని కోరుతూ

అబ్దుల్ కలీం

Friday, August 8, 2008


మిత్రులకు వందనాలు.బ్లాగు మొదలు పెట్టి చాలా రోజులు అయినా రాసేందుకు తీరిక దొరకలేదు. క్షమించాలి.ఇది నా ఒక్కడి బ్లాగు కాదు. నా మనసుకు నచ్చిన స్నేహితులందరి కోసం.నేను గుర్తున్న నా స్నేహితులు అందరూ తప్పక నా బ్లాగు చదువుతారని, తమ అభిప్రాయాలను తెలియజేస్తారని నా చిన్ని చిన్ని ఆశ.మిత్రుడు కలీం.

Tuesday, July 22, 2008

ప్రియమైన మిత్రులకు అబ్దుల్ కలీమ్ నుండి వందనాలు.